సాధారణంగా షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసుకుంటారు. కానీ ఇది రివర్స్ షాంపూ.



షాంపూ చేసుకునే ముందు కండిషనర్ పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇలా చేయడాన్ని రివర్స్ షాంపూ అని కూడా అంటారు.


అలా చేస్తే షాంపూలోని కఠినమైన రసాయనాలు జుట్టులోకి ప్రవేశించలేవు.



ఇది జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. స్టైలింగ్ లేకుండానే మీ జుట్టు మీ మాట వినేస్తుంది.



నిస్తేజమైన, పేలవమైన జుట్టు ఉంటే షాంపూకి ముందు కండిషనర్ చక్కని పరిష్కారం.
జుట్టు కడిగే ముందు దీన్ని అప్లై చేసుకుంటే నిగనిగలాడుతుంది.


వెంట్రుకలకు నూనె ఎక్కువగా ఉంటే కండిషనర్ పెట్టడం వల్ల దాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత షాంపూ చేస్తే శుభ్రంగా ఉంటుంది.



కండిషనర్ జుట్టుని ఫ్లాట్ గా కనిపించేలా చేస్తే రివర్స్ షాంపూ చేస్తే జుట్టు జిడ్డుగా కనిపించదు. కానీ పోషణ మాత్రం అందుతుంది.



షాంపూకి ముందు కండిషనర్ పెట్టడం వల్ల తలస్నానం చేసేటప్పుడు జుట్టు గట్టిగా లాగడం, చిక్కు పడటం వంటివి జరగవు.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.


రివర్స్ కండిషనింగ్ వల్ల జుట్టు మరింత మెరిసేలా చేసేందుకు సహాయపడుతుంది.



జుట్టు చిట్లిపోకుండా చేస్తుంది. హెయిర్ క్యూటికల్స్ ని శాంతపరుస్తుంది. జుట్టుకి మరింత పోషణ అందిస్తుంది



జుట్టునిహైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.



షాంపూకి ముందు కండిషనర్ చేయడం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న రంధ్రాలను అన్ లాగ్ చేస్తుంది.