కొరియా అమ్మాయిలు చాలా అందంగా, ముట్టుకుంటే మాసిపోతారు అన్నట్టుగా కనిపిస్తారు. మీరు అలా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి.

మీరు ప్రకాశవంతమైన చర్మంతో మెరిసిపోవాలంటే కొరియన్ల బ్యూటీ చిట్కా గ్లాస్ స్కిన్ ట్రై చేసి చూడండి

చాలా ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా కనిపించే చర్మ ఆకృతిని గ్లాస్ స్కిన్ అని అంటారు.

చర్మం మీద మలినాలు, ధూళిని పోగొట్టేందుకు నురుగు వచ్చే క్లీనర్ ఉపయోగించాలి. పాలు సహజ క్లీనర్ గా ఉపయోగించుకోవచ్చు.

సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌ను తయారు చేయడానికి పెరుగుతో పాటు కొన్ని మసూర్ పప్పు మిక్స్ చేసుకుని రాసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు ఉత్తమ టోనర్‌గా పనిచేస్తుంది. టోనర్లు చర్మం pH స్థాయిలని సమతుల్యం చేస్తాయి.

హైలురోనిక్ యాసిడ్ చర్మానికి మంచి ఎసెన్స్. చర్మాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చి నీటిని నిలుపుతుంది. ముడతలు, గీతలను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె, కొంచెం రోజ్ వాటర్ తో కలిపి బెడ్ మీద పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు. ఇది సహజ సీరం గా ఉపయోగపడుతుంది.

పసుపు, అలోవెరా జెల్, తేనె చర్మానికి అద్భుతంగా పని చేసే సహజ మాయిశ్చరైజర్లలో ఒకటి. ఇవి జిడ్డులేని చర్మాన్ని అందిస్తాయి.

పొడి చర్మం అయితే తేమను పెంచుకునేందుకు తేనె మంచి మాయిశ్చరైజింగ్ గా తీసుకోవచ్చు.

అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ ఫేస్ మాస్క్ తేమని నిలుపుతుంది. దురద తగ్గించడంలో సహాయపడుతుంది.