రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటే..

గుమ్మడి గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మగవారికి ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని ఇవి అందిస్తాయి. సెలీనియం, బీటాకెరాటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటివి రాకుండా గుమ్మడి గింజల్లోని పోషకాలు అడ్డుకుంటాయి.

ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడి గింజలు తినడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి. చక్కగా నిద్రపడుతుంది.

వీటిని పచ్చిగా తిన్నా మంచిదే, లేక సలాడ్‌లపై చల్లుకుని తిన్నా ఉత్తమమే.

వీటిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. తినడం వల్ల గాయాల నుంచి రక్తస్రావం త్వరగా ఆగుతుంది.

ఎముకల పటుత్వానికి ఈ నట్స్ ఎంతో మేలు చేస్తాయి.