మండే ఎండల్లో ద్రాక్ష తింటే ఆ సమస్యలు దూరం సూర్యకిరణాలు నేరుగా చర్మంపై తీవ్రస్థాయిలో తాకితే వివిధ రకాల వ్యాధులకు కారణం కావచ్చు. ఒక్కోసారి అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎండల్లో చర్మ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని కూడా తినవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ద్రాక్ష పండ్లను తింటే చర్మానికి ఎంతో మంచిది. సూర్య కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడినప్పుడు, వాటిని తట్టుకునే శక్తిని ద్రాక్ష పళ్ళు చర్మానికి ఇస్తాయి. ద్రాక్ష పండ్లలో ఫైటో కెమికల్స్ తో పాటు, రెస్వెరాట్రాల్ అని సమ్మేళనం కూడా ఉంటుంది.ఇది చర్మానికి హాని కలగకుండా రక్షణ పొరలా ఉంటుంది. ద్రాక్షలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. కాబట్టి వడదెబ్బ బారిన పడకుండా శరీరానికి రక్షణ దొరుకుతుంది. ద్రాక్షలు మూత్రపిండాల పనితీరును బాగు చేయడంతో పాటు, కొన్నిరకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలను ఇది తగ్గిస్తుంది. ఎవరైతే ద్రాక్షలను అధికంగా తింటారో, వారికి వడదెబ్బ కొట్టే అవకాశం తగ్గుతుంది.