వేసవితాపం తీరాలంటే తాటిముంజలు తినాల్సిందే వేసవిలో మాత్రమే దొరికే అద్భుత ఫలాలు తాటిముంజలు. వీటిని ఇంగ్లిషులో ఐస్ ఆపిల్ అని, పాల్మీరా పామ్ అని పిలుస్తారు. జెల్లీలా, చేత్తో పట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా ఉంటాయివి. ఇవి తింటే క్యాలరీలు తక్కువగా, శక్తి ఎక్కువగా అందుతుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలన్న, గురయ్యాక త్వరగా కోలుకోవాలన్న తాటిముంజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు,చక్కెరలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, ఐరన్, కాల్షియం తాటి ముంజల్లో లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. వీటిలో అధికమొత్తంలో నీరే ఉంటుంది కనుక శరీర బరువును కూడా తగ్గిస్తాయి. అమ్మవారు వంటి వేసవి వ్యాధుల బారిన పడిన వారు కూడా వీటిని తింటే మంచిది. ఇవి కాలేయ సంబంధ వ్యాధులును కూడా తగ్గిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం కాలేయంలో ఉన్న టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. కొందరు పొట్టు తీయకుండానే వీటిని తినేస్తారు. పొట్టులో కూడా చాలా పోషకాలు ఉంటయన్నది వారి నమ్మకం.