RRRలో బ్రిటీష్ యువతిగా మురిపించిన ముద్దుగుమ్మ ఒలివియా మోరిస్. RRR పాత్రలోనే కాదు, ఆమె నిజంగానే బ్రిటీష్ యువతి. ఒలివియా 29 జనవరి, 1997లో ఇంగ్లాండ్‌లోని సౌత్ వెస్ట్ లండన్‌లోని కింగ్‌స్టన్ అపాన్ థేమ్స్‌లో జన్మించింది. బాల్యం నుంచి ఆమెకు నటనపై ఆసక్తి ఉంది. దీంతో మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. చిన్నారులకి నటనలో శిక్షణ ఇస్తూ లండన్‌లో జరిగే పలు ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమెకు ‘7 ట్రైల్స్ ఇన్ 7డేస్’ అనే టీవీ సిరీస్‌లో ఛాన్స్ దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఒలివియాకు ‘RRR’ తొలి చిత్రం. తనని తాను ‘బిగ్ స్క్రీన్’పై చూసుకోవాలనే ఒలివియా కలను RRR సాకారం చేసింది. ఆ పాత్రకు ఎంపికైన డైసీ ఎడ్గార్ జోన్స్ RRR నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియాను వరించింది. ఒలివియా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ప్రస్తుతం ఒలివియా ‘ది హెడ్’ అనే వెబ్ సీరిస్‌లో నటిస్తోంది. Images Credit: Olivia/Instagram