ఇండియాలో ఒక్కో చోట ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు. కానీ, ఇంత భయానక ఆచారం గురించి ఎప్పుడైనా విన్నారా పెళ్లిలో కట్న కానుకలు సర్వసాధారణమే. నగదు, నగలు లేదా ఆస్తులివ్వడం గురించి మీకు తెలుసు. గౌరియా తెగకు చెందిన ప్రజలు.. పెళ్లంటే చాలు విష సర్పాల వేటలో మునిగితేలుతారు. పెళ్లిలో వరుడి కుటుంబానికి కట్నానికి బదులు 21 రకాల పాములను ఇస్తారు. ఈ సాంప్రదాయాన్ని అక్కడ ఎన్నో తరాలు నుంచి పాటిస్తున్నారు. విష సర్పాలను కట్నంగా ఇవ్వకపోతే ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలబడదనేది వారి నమ్మకం. ఆ తెగవారి జీవనోపాధి కూడా పాములను ఆడించమే కాబట్టి, వారికి పాములను పట్టుకోవడం జుజుబీ. ఆ పాములను నేరుగా చేతికి ఇవ్వకుండా బుట్టల్లో పెట్టి ఇస్తారట. ఆ బుట్టల్లోని ఒక్క పాము చనిపోయినా.. దాన్ని అపవిత్రంగా భావిస్తారట. పాములు చనిపోతే ప్రాయశ్చిత్తంగా గుండు కొట్టించుకుంటారు. Images Credit: Pixabay and Pixels