ఆహారంలో ఉప్పు తగ్గితే ఎన్ని లాభాలో ఉప్పు తగ్గినా పెద్దగా వచ్చే సమస్యలు ఉండవు కానీ, పెరిగితే మాత్రం ప్రాణాంతక సమస్యలు వచ్చి పడతాయి. ఉప్పు తగ్గిస్తే హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, కాలేయం దెబ్బతినడం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. హైబీపీ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉప్పును బాగా తగ్గించాలి. శరీరంలోని ద్రవాలు అధికంగా బయటికిపోవు.ఎలక్ట్రోలైట్ సమతుల్యత బావుంటుంది. ఉప్పు ఎక్కువైతే అలసట, నీరసం పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, బీన్స్‌లలో ఉప్పు తక్కువగా ఉంటుంది.