ఎర్రబియ్యంతో బరువు సులువుగా తగ్గొచ్చు



ఎర్రబియ్యం తినడం వల్ల బరువు చాలా త్వరగా తగ్గుతారని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



ఈ బియ్యంలో ఆంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. అందుకే ఈ బియ్యం ఎరుపుగా ఉంటాయి.



ఎర్రబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటివి తగ్గిస్తాయి.



రెడ్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే బరువు సులువుగా తగ్గుతారు.



టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఎర్రబియ్యం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



ఈ బియ్యంలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.



రెడ్ రైస్లో గ్లూటెన్ ఉండదు. కాబట్టి ఈ బియ్యం తినడం వల్ల ఎలాంటి అలెర్జీలు వచ్చే అవకాశం ఉండదు.



ఈ ఎర్రబియ్యం తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి.