ఉత్తపాదాలతో నడిస్తే ఒత్తిడి తగ్గిపోతుంది చెప్పులతో నడవడం కన్నా చెప్పులు తీసేసి ఉత్త పాదాలతో నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేలమీద పాదాలతో నడవడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. శరీరం రీఫ్రెష్ అవుతుంది. ఉత్త పాదాలతో నడిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలా పాదాలతో నడిస్తే అరి పాదాల్లో ఉండే నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. గడ్డి మీద నడిస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజుకు కనీసం ఇరవై నిమిషాలు నడిస్తే మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా ఇలా ఉత్త పాదాలతో నడవడం ఎంతో మంచిది. ఇలా ఉత్త పాదాలతో నడవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇలా ఉత్త పాదాలతో నడవడాన్ని ‘బేర్ ఫుట్ వాకింగ్’ అంటారు.