బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే జరిగే అనర్థం ఇదే



ఎంతో మంది బ్రేక్‌ఫాస్ట్‌కు విలువ లేదు. నేరుగా మధ్యాహ్న భోజనం తినడానికే ఇష్టపడతారు. అది తప్పు.



ప్రతి రోజూ కచ్చితంగా అల్పాహారాన్ని తినాల్సిందే. అది తినడం మానేస్తే శరీరానికి ఎన్నో అనార్థాలు కలుగుతాయి.



బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోయినట్టే.



అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ తరచూ స్కిప్ చేసే వారిలో గుండె జబ్బుల ముప్పు అధికమవుతుంది.



అల్పాహారం మానేసే వారిలో అసహనం, కోపం కూడా పెరిగిపోతాయి.



బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో తరచూ వికారం, వాంతులు వంటివి కూడా అవుతూ ఉంటాయి.



అంతేకాదు మహిళలు అల్పాహారం మానేస్తే దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.



బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మైగ్రేన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ.