మహిళల్లోనే అరిగిపోతున్న కీళ్లు



కీళ్ల వ్యాధులు పురుషుల కంటే మహిళలనే అధికంగా వేధిస్తున్నట్టు చెబుతున్న వైద్యులు.



నలభై ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువగా ఇది వస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్నవారికి ఈ ఆర్థరైటిస్ ఇబ్బంది పెడుతోంది.



మహిళల్లో కీళ్ల వ్యాధులు వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి హార్మోన్లలో అధికంగా మార్పులు జరుగుతాయి.



గర్భం ధరించినప్పుడు, మెనోపాజ్ దశలో కూడా హార్మోన్లలో మార్పులు ఎక్కువగా ఉంటాయి.



దానివల్లే పురుషులతో పోలిస్తే మహిళల్లో అధికంగా ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.



శరీర బరువు కూడా వీరు అధికంగా పెరుగుతారు. వ్యాయామం తక్కువగా చేస్తారు. అందుకే ఈ కీళ్లనొప్పులు మహిళల్ని టార్గెట్ చేస్తున్నాయి.



కీళ్ల జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయాలి.



మహిళలు తాజా ఆహారాన్ని తినాలి. హార్మోన్లలో అసమతుల్యత రాకుండా చూసుకోవాలి.