బాదం పప్పు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో స్థూలకాయం, బ్లడ్ షుగర్ లో మంచి మార్పు కనిపిస్తుంది. బాదం తినేవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి పాంక్రియాస్ పని తీరు మెరుగుపడుతుంది. బాదం వల్ల బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ప్రీడయాబెటిస్ స్టేజ్ లో ఉన్న వారికి ఇదొక చక్కని ఆరోగ్యవంతమైన స్నాక్ బాదం గింజలు కార్డియోవాస్క్యూలార్ డిసిజ్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. బాదంలో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్ , విటమిన్ ఇ.. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్లను మెరుగుపరచడంలో తొడ్పడతాయి. కార్డియోమెటబాలిక్ ఆరోగ్యానికి బాదం వరం వంటిది. 28 గ్రాముల బాదం గింజల నుంచి 6 గ్రాముల ప్రొటీన్ దొరుకుతుంది. నిత్యం బాదం తినేవారిలో పాంక్రియాస్‌లో ఇన్సులిన్‌ను తయారు చేసే బీటా కణాల పనితీరు మెరుగైనట్టు గుర్తించారు. బరువు తగ్గాలనుకునే వారికి ఆరోగ్యవంతమైన డైట్