ఆపిల్ డైట్‌తో సులువుగా బరువు తగ్గొచ్చు అధికబరువు సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఆపిల్ డైట్ వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఆపిల్ తినడం ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఆపిల్ డైట్‌లో భాగంగా మూడు పూటలా తినే అన్నాన్ని తగ్గించి ఆపిల్ పండ్లను తినాలి. ప్రతి పూట ఆపిల్ పండ్లతో పాటూ స్మూతీలు వంటివి తినాలి. ఆపిల్ తినడం వల్ల శరీరానికి చాలా తక్కువ కేలరీలు అందుతాయి. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు. అయిదు రోజుల్లోనే ఈ ఆపిల్ డైట్ వల్ల బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఆపిల్ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇతర ఆహారాలను తినడం కూడా తగ్గుతుంది. ఇతర ఆహారాలు అతిగా తినకుండా ఆపిల్ అడ్డుకుంటుంది.