బిర్యానీ ఆకులు ఇలా తింటే...



బిర్యానిలు, పలావులు వండినప్పుడు బిర్యానీ ఆకును వాడుతూ ఉంటారు.



బిర్యానీ ఆకు మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. బిర్యాని ఆకులో ఉండే పోషకాలన్నీ వండుతున్నప్పుడే ఆహారంలో కలిసిపోతాయి.



ఏ ఆహారంలోనైనా బిర్యానీ ఆకులను కలిపి వండితే ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.



బిర్యాని ఆకులతో టీ చేసుకుని తాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. దీనివల్ల గుండెకు ఆరోగ్యం.



ఈ ఆకుల్లో కాల్షియం, మాంగనీస్, విటమిన్ కే, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకలను దృఢంగా మారుస్తాయి.



మధుమేహులు కచ్చితంగా తినాల్సిన వాటిలో ఈ బిర్యానీ ఆకులు కూడా ఒకటి. ఇది రక్తంలో చక్కెర పెరగకుండా అడ్డుకుంటాయి.



నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా బిర్యానీ ఆకులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి చక్కటి నిద్ర పట్టేలా చేస్తాయి.



అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు బిర్యాని ఆకులు ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలి.