శీతాకాలంలో చిలగడ దుంపలు తప్పకుండా తినాలంట. ఎందుకంటే ఇందులో బోలెడన్ని పోషకాలు ఉంటాయట.

విటమిన్లు, ఫైబర్, మినరల్స్ తో చిలగడదుంపలు అద్భుతమైన ఆహారం.

వీటిలో విటమిన్లు ఎ,సి తోపాటు మాంగనీస్, కాపర్, విటమిన్ బి6, పోటాషియం వంటి పోషకాలు ఉంటాయి.

ఈ దుంపలు మధుమేహులకు కూడా మంచి ఆహారం. ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఇవి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి.

యాంటీఆక్సిడెంట్లు కలిగిన చిలగడదుంపలు డయబెటిక్ ఫ్రెండ్లీ దుంపలు.

చిలగడదుంపల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ వల్ల ఇవి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్ గుణాల మూలంగా చిలగడదుంపల వల్ల చిన్నచిన్న ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తిని నిరోధక వ్యవస్థ సంతరించుకుంటుంది.

అందుకే, చిలగడ దుంపలను చలికాలంలో తినాలని చెబుతున్నారు.

ఇందులోని పోటాషియం బీపీ అదుపులో ఉంచుతుంది. ఇది రక్తనాళాలు, గుండెకు మంచిది. All images credit : Pexels