బియ్యం పైపొర (పొట్టు) తొలగించకపోవడం వల్ల వీటిలో పోషకాలు నిలిచి ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, మాంగనీస్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. మలబద్దకం నివారించబడుతుంది. అంతేకాదు ఈ ఫైబర్ వల్ల ఆహారం త్వరగా గ్లూకోజ్ గా మారి రక్తంలో కలవదు కనుక డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సహజమైన నూనెల వల్ల గుండెకు మేలు జరుగుతుంది. క్రమం తప్పకుండా వాడినపుడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు కలిగి ఉండడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక బరువు తగ్గేందుకు మంచి చాయిస్. బ్రౌన్ రైస్ లో ఉండే సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నివారించబడతాయి. Representational Image : Pexels