చలికాలంలో దొరికే మరో అద్భుతమైన పండు ఆరెంజ్. శీతాకాలపు సవాళ్లను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సన్నద్ధం చేసే ఈపండు రోజూ ఒకటి తింటే ఏం జరుగుతుందో చూద్దాం. ఆరెంజ్ లో ఉండే నీరు చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. నారింజలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగుపరుస్తుంది. ఆరెంజ్ లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు ఓవరాల్ ఆరోగ్యానికి కారణం అవుతాయి. ఫ్లెవనాయిడ్లు, కెరోటినాయిడ్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను సంతులనం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని కాపాడుతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఆరెంజ్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలతో శ్వాస వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేసే బయోయాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఈ పండులో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు దోహదం చేస్తుంది. Representational Image : Pexels