పొద్దున్నే నిద్ర లేవాలని అందరికీ ఉంటుంది. కానీ లేవటమే కష్టం పొద్దునే లేవాలనే కోరికను ఈ చిట్కాలతో నెరవేర్చుకోండి. వీకెండ్ అయినా సరే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి నిద్ర లేస్తే బాడీ క్లాక్ సెట్ అవుతుంది. నిద్ర సమయం అయ్యిందని మీ శరీరానికి తెలిపే ఒక టైమ్ టేబుల్ అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు పుస్తకం చదవడం, స్నానం చెయ్యడం. మొబైల్, ల్యాప్ టాప్‌ల బ్లూలైట్.. మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నిద్రకు ముందు కాబట్టి గాడ్జెట్స్ వాడొద్దు. సహజమైన కాంతి శరీరంలోని జీవగడియారాన్ని నియంత్రించేందుకు దోహదం చేస్తుంది. త్వరగా మేల్కొనేందుకు ఉపకరిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మరింత బద్ధకంగా అనిపిస్తుంది. నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగాలి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ ఉంటే నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్రకు 2, 3 గంటల ముందే వ్యాయామం పూర్తి చేసుకోవాలి. All Images Credit: Pexels