మీరు పానీ పూరీ ప్రియులా? అయితే మీకొక గుడ్ న్యూస్. బరువు తగ్గాలని అనుకుంటే ఎంచక్కా పానీ పూరీ తినేయవచ్చు. కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయండోయ్. వాటిని ఫాలో అవుతూ పానీ పూరీ తింటూ బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. ఒక గోల్ గప్పాలో 36 కేలరీలు ఉంటాయి. అంటే ఒక ప్లేట్ తింటే 216 కేలరీలు అందుతాయి. ఇది రెండు రొటీలతో సమానం. పానీ పూరీలో ఉపయోగించే పానీలో జీలకర్ర, కొత్తిమీర, పుదీనాతో తయారు చేస్తారు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలని అనుకుంటే సుజీతో కాకుండా గోధుమ పిండితో గోల్ గప్పా చేసుకోండి. అది పొట్టని నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా పానీ పూరీ సౌకర్యవంతంగా ఉంటుందట. బరువు అదుపులో ఉంచుకోవడం కోసం పానీ పూరీని తీపి చట్నీతో తీసుకోవద్దు. అలాగే ఇంట్లో తక్కువ నూనెతో గోల్ గప్ప చేసుకుంటే మంచిది. ప్రోటీన్స్ కోసం బంగాళాదుంప కూరకి బదులుగా శనగలు, స్వీట్ కార్న్, పనీర్ తో చేసిన కూర తీసుకోవచ్చు. తినమన్నారు కదా అని అతిగా తినకూడదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే బరువు తగ్గుతారు.