మయోసైటిస్‌‌తో ఇంకా ఫైట్ చేస్తున్న సమంత



సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.



ఆమె తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఎన్నో నెలలుగా సామ్ మయోసైటిస్‌తో ఇబ్బంది పడుతుంది.



సమంత చెప్పిన ప్రకారం మయోసైటిస్ వస్తే మంచం మీద నుంచి లేవడానికి కూడా శక్తి ఉండదు.



కండరాలు నొప్పిగా, మంటగా అనిపిస్తాయి. వాటిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.



మయోసైటిస్ ఉన్న వారికి మైగ్రేన్ తలనొప్పి వచ్చి పోతూ ఉంటుంది.



శరీరం ఒక్కోసారి ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. చాలా నీరసంగా మారిపోతుంది.



ఉదయం లేచేసరికి కళ్లు తీవ్రంగా మంట పుడతాయి. సూదులతో గుచ్చినట్టు నొప్పి వస్తాయి. కళ్లు వాచిపోతూ ఉంటాయి.



నిలుచున్నా, కాసేపు నడిచినా చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది.



సమంత ఎన్నో నెలల నుంచి ఈ బాధలన్నీ భరిస్తూ నటిస్తోంది.