ఒక కప్పు లెమన్ టీ తాగితే ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటారు.



కానీ అదే కప్పు లెమన్ టీ మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుందనే విషయం మీకు తెలుసా?



నిమ్మకాయ సహజంగానే ఆమ్లత్వం కలిగి ఉంటుంది. టీ కూడా అదే విధంగా ఆమ్లంగా ఉంటుంది.



అధిక ఆమ్ల కంటెంట్ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.



లెమన్ టీ అధిక మొత్తంలో తీసుకుంటే పళ్ల మీద ఉండే ఏనామిల్ కోల్పోతారు. దంతాలు కూడా సెన్సిటివ్ గా మారతాయి.



గుండెల్లో మంట, యాసిడ్ రీఫ్లక్స్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యని కలిగిస్తుంది.



లెమన్ టీ తాగిన తర్వాత తలనొప్పి కూడా రావచ్చు.



నిమ్మకాయ మూత్రం ద్వారా కాల్షియంని బయటకి పంపిస్తుంది.



ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిలని పెంచుతాయి. ఇది నేరుగా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.



లెమన్ టీ రోజుకి 1 లేదా 2 కప్పులకు పరిమితం చేయడం ఉత్తమం.
అప్పుడే దీని వల్ల కలిగే ప్రయోజనాలను పొందుతారు.