రోజుకు గుప్పెడు నువ్వులు తినండి చాలు నిత్యం గుప్పెడు నువ్వులను తింటే వాటితో 3.5 గ్రాముల ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటాయి నువ్వులు నిత్యం తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి హైబీపీ సమస్య ఉన్నవారు నిత్యం నువ్వులు తింటే మంచిది బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది అలాగే నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.శరీరానికి కావల్సిన విటమిన్లు బి1, బి3, బి6లు అందుతాయి. నువ్వులను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే ప్రయోజనం కలుగుతుంది. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నువ్వుల్లో ఉండే సెలీనియం, కాపర్, జింక్‌లు థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. హార్మోన్లు కూడా సమతుల్యంగా పనిచేస్తాయి. నువ్వులను వేయించి తీసుకోవచ్చు. లేదా అల్పాహారం, భోజనంలోనూ, బెల్లంతో చేసిన లడ్డూల రూపంలో, పెరుగు, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. Images Credit: Pixabay