ఈ చీర ఖరీదెంతో తెలుసా? ఆశ్చర్యపోతారు శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇటీవల ఈ చీరలో మెరిసింది. దీని ధర అక్షరాలా రెండు లక్షలా ఇరవై తొమ్మిది వేల రూపాయలు. చీర మొత్తం ఎంబ్రాయిడరీతోనే సిద్ధమైన చీర ఇది. సింపుల్‌గా అందంగా కనిపిస్తోంది ఖుషీ కపూర్. ఈమె త్వరలోనే సినిమాల్లో అడుగుపెడుతోంది. అక్క జాన్వీ కపూర్ లాగే బాలీవుడ్లో స్థిరపడాలని కోరుకుంటోంది. జోయా అక్తర్ తీస్తున్న సినిమా ద్వారా ఈమె తెరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఖుషీ డ్రెస్సింగ్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. ఆమె డ్రెస్సింగ్ చాలా ఫ్యాషన్ గా ఉంటుంది. ఖుషీ మంచి హైట్‌తో అందంగా ఉంటుంది. (All Images: Khushi Kapoor/Instagram)