కొంత మందికి కాఫీతాగితే మైగ్రేన్ తగ్గినట్టు ఉంటుంది కానీ ఎక్కువగా తాగినా లేక అసలు తాగక పోయినా మైగ్రేన్ రావచ్చు.

రెడ్ వైన్ లో ఉండే టైరామిన్ వల్ల మైగ్రేన్ అటాక్ రావచ్చు

చీజ్ లో కూడా టైరామిన్ ఉంటుంది కనుక మైగ్రేన్ కు కారణం అవతుంది.

చాక్లెట్ లో కెఫిన్, టైరామిన్ రెండూ కూడా మైగ్రేన్ అటాక్ కు కారణం కావచ్చు.

డైట్ సోడాలు, లేదా షుగర్ ఫ్రీ ఉత్పత్తుల్లో ఉండే అస్పార్టమే అనే స్వీట్నర్ వల్ల మైగ్రేన్ రావచ్చు.



ప్రాసెస్ చేసిన బెకన్, సాసేజ్, హాట్ డాగ్ వంటి మాంసాహారాల్లో ఉండే నైట్రైట్స్, నైట్రేట్స్ వల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది.

అరటి పండు, ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ పళ్లలో ఉండే టైరామిన్ వల్ల మైగ్రేన్ వస్తుంది.

రెస్టారెంట్ భోజనాలు, ఫాస్ట్ ఫూడ్ లలో ఉండే మోనో సోడియం గ్లుటమేట్ మైగ్రేన్ ను ట్రిగర్ చేస్తుంది.

సల్ఫెట్స్ ఎక్కువగా ఉండే ఉల్లి, వెల్లుల్లి వల్ల కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది.

చాలా రకాల ప్యాక్డ్ ఫూడ్ లో వాడే రంగులు, ప్రిజర్వేటివ్ ల వల్ల మైగ్రేన్ ట్రిగర్ కావచ్చు.

Representational image:Pexels