వీరు రక్తదానం చేయకూడదు రక్తదానం చేయడం వల్ల మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవారవుతాం. అందుకే ఆరోగ్యకరమైన ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని చెబుతారు వైద్యులు. రక్తదానం చేసేవారు కొన్ని రకాల ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. 18 ఏళ్లు దాటిన వారు, 65 వయసు దాటని వారు రక్తదానం చేయొచ్చు. అయితే వారు ఆరోగ్యవంతులై ఉండాలి. బీపీ అధికంగా ఉన్నవారు కూడా రక్తదానం ఇవ్వకూడదు. గుండె జబ్బులు ఉన్నవారు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలు ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండాలి. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులకు మందులు వాడుతున్న వారు రక్తదానం చేయకపోవడమే మంచిది. టాటూ వేయించుకున్నాక ఒక ఆరు నెలల వరకు రక్తదానం చేయకపోవడమే మంచిది. లైంగిక వ్యాధులు ఉన్న వారు రక్తదానం చేయకూడదు.