మెనోపాజ్ తర్వాత ఈ మార్పులు తప్పవు మహిళల జీవితంలో మెనోపాజ్ ఒక ముఖ్యమైన దశ. ఇది ఋతుక్రమం ఆగిపోయే దశ. పన్నేండేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నలభై ఏళ్లు దాటాక ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. ఇలా మెనోపాజ్ దశకు వచ్చిన మహిళల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయి. వారి హార్మోన్లలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అధికంగా వస్తాయి. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ ఉంటారు. తీవ్రంగా అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. వారిని కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఏ విషయాల పైనా ఆసక్తి ఉండదు. మెనోపాజ్ వచ్చిన మహిళలు చిన్న చిన్న దెబ్బలు కూడా తట్టుకోలేరు. చిన్న గాయమైనా కూడా అది పెద్దగా మారిపోతుంది. మెనోపాజ్ వచ్చాక స్త్రీలు స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఏరోబిక్ వ్యాయామాలు అంటే రన్నింగ్ లేదా వాకింగ్ వంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఖచ్చితంగా వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలను చేస్తూ ఉండాలి.