ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ చెలరేగుతున్నాడు. మొదటి రోజు అజేయంగా 179 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ 257 బంతుల్లో ఈ స్కోరు సాధించాడు. ఇందులో 17 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. 94 పరుగుల వద్ద సిక్సర్‌తో యశస్వి జైస్వాల్ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో మొదటి రోజు ఒక బ్యాటర్ చేసిన ఆరో అత్యధిక స్కోరు ఇది. 228 పరుగులతో సెహ్వాగ్ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై ఒక రోజులో అత్యధిక స్కోరు సాధించిన భారతీయ బ్యాటర్లలో యశస్వి మూడో స్థానంలో ఉన్నాడు.