Image Source: ABP Gallery

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ రికార్డులు బద్దలుకొడుతోంది.

Image Source: ABP Gallery

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ అజేయంగా 95 పరుగులు చేసింది.

Image Source: ABP Gallery

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.

Image Source: ABP Gallery

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: ABP Gallery

మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.

Image Source: ABP Gallery

ముంబై ఇండియన్స్ తరఫున హర్మన్ ప్రీత్ (95 నాటౌట్) అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించింది.

Image Source: ABP Gallery

మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోరు.

Image Source: ABP Gallery

మొదటి రెండు స్థానాల్లో సోఫీ డివైన్ (99), అలీస్సా హీలీ (96 నాటౌట్) ఉన్నారు.

Image Source: ABP Gallery

మహిళల ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయ బ్యాటర్‌గా నిలిచింది.

Image Source: ABP Gallery

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ స్మృతి మంథన (80) రికార్డును హర్మన్ ప్రీత్ బద్దలు కొట్టింది.