భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు సాధించాడు.

ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాడు.

వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 88 సిక్సర్లు కొట్టాడు.

ఈ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో కూడా రోహిత్ శర్మనే ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై హిట్ మ్యాన్ ఏకంగా 115 సిక్సర్లు సాధించాడు.

శ్రీలంకపై కూడా రోహిత్ శర్మ 76 సిక్సర్లు సాధించాడు.

భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన వారిలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు.

టెస్టుల్లో రోహిత్ శర్మ 77 సిక్సర్లు కొట్టాడు.

ఈ విషయంలో సెహ్వాగ్ టాపర్‌గా నిలిచాడు. అతను 90 సిక్సర్లు కొట్టాడు.

మహేంద్ర సింగ్ ధోని 78 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు.