కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి వింటేజ్ కార్లు, బైకులు, సూపర్ బైకులంటే చాలా ఇష్టం. అతడి గ్యారేజ్ లో చాలా వాహనాలు ఉన్నాయి.
ధోనీ జంతు ప్రేమికుడు. క్రికెట్ లేదంటే సొంత వ్యవసాయం క్షేత్రంలో గడిపేస్తాడు. ఇంట్లో ఉన్న కుక్కలు, గుర్రం, ఇతర పెట్స్ తోనే కాలక్షేపం చేస్తుంటాడు.
ధోని వద్ద మూడు జతల కుక్కలు ఉన్నాయి. వీటిలో బెల్జియన్ షెపర్డ్ పెయిర్ (జత) ఒకటి కాగా సైబేరియా జాతికి చెందిన వైట్ హస్కీస్, డచ్ షెపర్డ్ ఉన్నాయి.
ధోని వీటికి జరా, సామ్, లిల్లీ, గబ్బర్, జోయా అని పేర్లు కూడా పెట్టాడు. ధోని ఎక్కడికి వెళ్లినా తన కుటుంబంతో సహా వీటిలో రెండింటినైనా వెంట తీసుకెళ్తాడు.
ధోని 2011 నుంచి ఛేతక్ అనే గుర్రాన్ని సాకుతున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో పాడి ఆవులు, గేదెలు, కోళ్లు పెంచుతున్నాడు. కూడా పెంచుతున్నాడు. ఓ షెడ్డును వేయించాడు. జంతు వ్యర్థాలను ఎరువుగా వాడుతాడు.
మార్కెట్లోకి కొత్తగా హైఎండ్ మోడల్స్ బైక్స్, కార్స్ వస్తే అవి ధోని గ్యారేజ్ లోకి రావాల్సిందే. ధోని వద్ద ఉన్న బైకులు, కార్ల కలెక్షన్ ఏంటో ఇక్కడ చూద్దాం.