మొదట్లో ధోనీ జులపాల జట్టుతో కనిపించేవాడు. జాన్ అబ్రహం స్ఫూర్తితో అలా చేశాడట!

సింగర్లు కిషోర్ కుమార్, ముకేశ్ అంటే ధోనీకి పిచ్చి. ఓల్డ్ క్లాసిక్స్ అంటే చాలా ఇష్టం.

వింటేజ్ మోటార్ సైకిల్స్, సూపర్ బైక్స్ అంటే మహీకి ప్రాణం. తన గ్యారేజీలో ఇలాంటివెన్నో ఉంటాయి.

మహీ 2007లో తొలిసారి సాక్షిని చూశాడు. 2010లో పెళ్లి చేసుకున్నాడు. జీవా వారి గారాల పట్టి!



ఐసీసీ నిర్వహించే అన్ని ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఐసీసీ వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కు అన్ని సీజన్లలో కెప్టెన్సీ చేసింది ఎంఎస్ ఒక్కడే. ఐదు ట్రోఫీలు అందించాడు. ఒక్కసారి మినహా అన్ని సార్లూ జట్టును ప్లేఆఫ్ ఆడించాడు.

2005లో ధోనీ శ్రీలంకపై తన అత్యధిక స్కోరు 183* సాధించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగులో 11 సార్లు ఫైనల్ ఆడిన ఏకైక ఆటగాడు మహీ

చెపాక్ టెస్టులో 2013లో ఆసీస్ పై ధోనీ 224 పరుగులు చేశాడు. భారత్ కెప్టెన్లలో ఇంత స్కోరు చేసిన రెండో ఆటగాడు మహీ.



2009లో టీమ్ఇండియాను తొలిసారి టెస్టుల్లో నంబర్ వన్ గా నిలిపాడు ధోనీ.