మహేంద్ర సింగ్ ధోని ఫ్లైట్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ధోని సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించరు. తన ఫొటోలు కూడా ఎక్కువగా పోస్ట్ చేయరు. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఇది చెన్నైకి ఐదో ఐపీఎల్ ట్రోఫీ కావడం విశేషం. దీంతో అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన జట్లలో ముంబైని చెన్నై ఈక్వల్ చేసింది. ఇప్పుడు రెండు జట్లూ ఐదేసి ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్‌ను చెన్నై ఓడించింది. చివరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా ఈ మ్యాచ్ సాగింది. ఆఖరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా 10 పరుగులు చేసి చెన్నైని గెలిపించాడు.