Image Source: WPLT20 Twitter

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా ముంబై నిలిచింది.

Image Source: WPLT20 Twitter

ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరు చేయడంతో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

Image Source: WPLT20 Twitter

సాధించాల్సిన లక్ష్యం భారీగా లేకపోయినా ముంబైని ఢిల్లీ బౌలర్లు మూడు చెరువుల నీళ్లు తాగించారు.

Image Source: WPLT20 Twitter

ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు.

Image Source: WPLT20 Twitter

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Image Source: WPLT20 Twitter

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

Image Source: WPLT20 Twitter

కెప్టెన్ మెగ్ లానింగ్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

షెఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు.



Image Source: WPLT20 Twitter

కానీ ఆఖర్లో శిఖా పాండే, రాధా యాదవ్ మెరుపులు మెరిపించారు.

Image Source: WPLT20 Twitter

లక్ష్య ఛేదనలో ముంబై కూడా ఇబ్బంది పడింది. కానీ ఎట్టకేలకు విజయం సాధించింది.