ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ సూర్యకుమార్ యాదవ్‌కు అస్సలు కలిసి రాలేదు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. అంటే మూడు మ్యాచ్‌ల్లోనూ మొదటి బంతికే వికెట్ ఇచ్చేశాడన్న మాట. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. అయితే వన్డేల్లో మాత్రం తన మార్కు ఇంతవరకు చూపించలేదు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో స్టార్క్‌కు సూర్య వికెట్‌ను సమర్పించాడు. మూడో మ్యాచ్‌లో మాత్రం ఆస్టన్ అగర్ ఈ వికెట్‌ను దక్కించుకున్నాడు. సూర్య కంటే ముందు కూడా వరుసగా మూడు గోల్డెన్ డక్‌లు అయిన వాళ్లు ఉన్నారు. ఈ లిస్టులో మొదట మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉండటం విశేషం. అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.