ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51*), మిషెల్ మార్ష్ (66*) అర్థ సెంచరీలు సాధించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఐదు వికెట్లు తీసుకున్న మిషెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌పై మిషెల్ మార్ష్ అద్భుత రికార్డు కొనసాగింది. మూడో వన్డే బుధవారం (మార్చి 29) జరగనుంది.