ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా సూపర్‌ డూపర్‌ విక్టరీ సాధించింది. వాంఖడేలో దుమ్మురేపింది.

మూడు మ్యాచుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ప్రత్యర్థి నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సాధికారికంగా ఛేదించింది.

సీమ్‌, స్వింగ్‌తో ఆసీస్‌ పేసర్లు వణికించిన వేళ.. ఓడిపోతామేమోనని ఆందోళన చెందిన వేళ..

కేఎల్‌ రాహుల్‌ (75; 91 బంతుల్లో 7x4, 1x6) నిలబడ్డాడు. తనకిష్టమైన ముంబయిలో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

రవీంద్ర జడేజా (45; 69 బంతుల్లో 5x4) అతడికి అండగా నిలిచాడు.

ఆసీస్‌లో మిచెల్‌ మార్ష్‌ (81: 65 బంతుల్లో 10x4, 5x6) ఒంటరి పోరాటం చేశాడు.

మహ్మద్‌ షమి, సిరాజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

రాహుల్, జడ్డూ 123 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

రెండో వన్డే విశాఖ పట్నంలో జరుగుతుంది.