మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదటి ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్లలో యాస్తిక భాటియా (41: 32 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో విజయం. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుకు మొదటి పరాజయం. మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఢిల్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో మెగ్ లానింగ్ (43: 41 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సైకా ఇషాక్ మూడు కీలక వికెట్లతో ముంబై వెన్ను విరిచింది.