ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. టోర్నీలో ముంబైకి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి. ఓపెనర్లు హీలీ మాథ్యూస్ (77 నాటౌట్), యస్తికా (23) మొదటి వికెట్‌కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత హీలీకి నటాలీ స్కీవర్ బ్రంట్ (55 నాటౌట్) తోడైంది. వీరి జోడిని విడగొట్టడానికి బెంగళూరు కెప్టెన్ స్మృతి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. వీరు రెండో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరు 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.