గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి గెలిచింది. యూపీ వారియర్జ్ గ్రేస్ హారిస్ (59*: 26 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచింది. ఆఖరి 30 బంతుల్లో 75 పరుగులను యూపీ వారియర్జ్ సాధించడం విశేషం. యూపీ వారియర్జ్‌కు ప్రారంభంలోనే ఆరంభంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. యూపీ వారియర్జ్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కిరణ్ నవ్‌గిరే (53: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. చివరి మూడు ఓవర్లో 52 పరుగులు చేయాల్సిన దశలో గ్రేస్ హారిస్ చెలరేగి పోయింది. తనకి సోఫీ ఎకిల్ స్టోన్ (22 నాటౌట్: 12 బంతుల్లో) చక్కటి సహకారం అందించింది.