భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా కొంచెం పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (104 బ్యాటింగ్), కామెరాన్ గ్రీన్ (49 బ్యాటింగ్) చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 61 పరుగుల వద్ద భారత్‌కు తొలి వికెట్ ట్రావిస్ హెడ్ (32) రూపంలో దొరికింది. మార్నస్ లబుషేన్ (3) వచ్చిన కాసేపటికే వెనుదిరిగాడు. రెండో సెషన్‌లో భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా పడలేదు. టీ బ్రేక్ అనంతరం స్టీవ్ స్మిత్ (38), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (17) అవుటయ్యారు. అయితే ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ మరో వికెట్ పడనివ్వలేదు.