మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ నాలుగు వికెట్లు దక్కించుకుంది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి గయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం యూపీ వారియర్జ్ 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. అలీస్సా హీలీకి (96 నాటౌట్: 47 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయం పాలైంది. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి. దీంతో పాటు మిగతా జట్ల సమీకరణాల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది.