మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ 11 పరుగుల గెలుపును అందుకుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్, రెండో స్థానంలో ఉన్న ఢిల్లీని ఓడించడం సంచలనమే. టోర్నీలో మిగతా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను ఇది ప్రభావితం చేయనుంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ (57: 45 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాష్లే గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మారిజానే కాప్ (36: 29 బంతుల్లో) టాప్ స్కోరర్. All Images Credits: WPLT20 Twitter