మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. యూపీ వారియర్జ్‌పై ముంబై ఇండియన్స్ 72 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం యూపీ వారియర్జ్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై ఇండియన్స్ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో ముంబై చేతిలో ఓడిన యూపీ ఇంటి బాట పట్టింది. ముంబై బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ముంబై బౌలర్ ఇసీ వాంగ్ హ్యాట్రిక్ సాధించింది. నాట్ స్కివర్ బ్రంట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.