సౌతాఫ్రికా పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20ల చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసి రికార్డు సృష్టించింది. 259 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ ఛార్ల్స్ (118: 46 బంతుల్లో) శతక్కొట్టాడు. దీంతో ఇక సౌతాఫ్రికా పనైపోయిందిలే అనుకున్నారంతా. కానీ ఓపెనర్లు డి కాక్ (100: 44 బంతుల్లో), హెండ్రిక్స్ (68: 28 బంతుల్లో) వీర లెవెల్ లో ఉతికేశారు. పవర్ ప్లేలోనే స్కోరును వంద దాటించేశారు. డికాక్ తన మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ కూడా బాదేశాడు. కెప్టెన్ మార్ క్రమ్ (38 నాటౌట్: 21 బంతుల్లో) కూడా అదరగొట్టాడు.