షియోమీ 12ఎస్ సిరీస్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి.

ఈ సిరీస్‌లో షియోమీ 12ఎస్, షియోమీ 12ఎస్ ప్రో, షియోమీ 12ఎస్ అల్ట్రా ఫోన్లు ఉన్నాయి.

షియోమీ 12ఎస్ ధర 3,999 యువాన్ల (సుమారు రూ.47,100) నుంచి ప్రారంభం కానుంది.

షియోమీ 12ఎస్ ప్రో ధర 4,699 యువాన్ల (సుమారు రూ.55,400) నుంచి ప్రారంభం కానుంది.

షియోమీ 12ఎస్ అల్ట్రా ధర 5,999 యువాన్ల (సుమారు రూ.70,700) నుంచి ప్రారంభం కానుంది.

షియోమీ 12ఎస్‌లో 50 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.

షియోమీ 12ఎస్ ప్రోలో 50 మెగాపిక్సెల్ + 50 మెగాపిక్సెల్ + 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు.

షియోమీ 12ఎస్ అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ + 48 మెగాపిక్సెల్ + 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.

ఈ మూడు ఫోన్లలోనూ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్లను అందించారు.

ఈ సిరీస్ ఫోన్లు త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.