సంతాన సాఫల్యానికి యూకే వైద్యులు ఇచ్చిన సలహాలివే. ఒకసారి ట్రై చేయండి. దంపతులు క్రమం తప్పకుండా సెక్స్ చేస్తేనే.. గర్భధారణ అవకాశాలు ఉంటాయి. స్త్రీ అండోత్పత్తి సమయంలో ఎక్కువగా సెక్స్ చేయాలి. మహిళ రుతుస్రావానికి ముందు 10 లేదా 16 రోజుల మధ్య అండోత్పత్తి జరుగుతుంది. ఆ సమయంలో సెక్స్ చేసినట్లయితే పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. అండాశయంలో విడుదలయ్యే గుడ్డు కేవలం 12 నుంచి 24 గంటలే జీవిస్తుంది. బిడ్డను కనేందుకు 14 వారాలుపాటు సెక్స్ చేయాలి. అంటే కనీసం 100 సార్లు సెక్స్ చేయాలి. గర్భం దాల్చాలంటే.. మిషనరీ భంగిమే ఉత్తమం. మిషనరీ భంగిమ అంటే.. రెగ్యులర్ పొజీషన్. వీర్యం వచ్చేప్పుడు పురుషాంగం.. స్త్రీ జననాంగం లోపలే ఉండాలి. సెక్స్ తర్వాత మహిళ వీర్యాన్ని శుభ్రం చేసుకోకుండా.. కాళ్లను పైకెత్తితే ఫలితం ఉండవచ్చు. కొందరు స్త్రీలు.. వీర్యం లోపలి వరకు వెళ్లేందుకు నడుము కింద దిండు (తలగడ) పెడతారు. Images and Videos Credit: Pexels