ఈ వారం కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

హ్యాపీ బర్త్ డే: లావణ్యా త్రిపాఠి నటిస్తోన్న ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కడువా: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ లేటెస్ట్ సినిమాను జూలై 7న విడుదల చేయనున్నారు. 

మయోన్: ఈ తమిళ డబ్బింగ్ సినిమాను జూలై 7న రిలీజ్ చేయనున్నారు. 

జూలై 8న 'మా నాన్న నక్సలైట్' అనే సినిమా విడుదల కానుంది.

థియేటర్లలో భారీ విజయం అందుకున్న 'విక్రమ్' సినిమా జూలై 8న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

పాపులర్ స్టార్స్ నటించిన 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' సిరీస్ జూలై 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

నాని నటించిన 'అంటే సుందరానికి' జూలై 10నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

పాపులర్ టీవీ షో 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7 జూలై7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.