మిస్ ఇండియా ఓ నాట్య మయూరి మిస్ ఇండియాగా కర్ణాటకకు చెందిన సినీ శెట్టి గెలిచింది. ఆమె ముంబైలో పెరిగింది. కానీ తల్లిదండ్రుల సొంతూరు కర్ణాటకలోనే ఉంది. నాలుగేళ్లకే భరతనాట్యంలో ఆరితేరింది. వెస్ట్రన్ డ్యాన్సులో అదరగొడుతుంది. చూపు తిప్పుకోవడం కొంచెం కష్టం. పదహారేళ్ల వయసు నుంచే ప్రకటనల్లో నటించసాగింది. ఇప్పటివరకు ఎయిర్ టెల్, పాంటాలూన్స్ వంటి యాడ్స్ లో నటించింది. త్వరలో మనదేశం తరుఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనుంది. అందం, నాట్యం రెండూ కలిసిన అరుదైన సౌందర్యం ఆమెది.