వారఫలాలు (జులై 4 నుంచి 10 వరకు )



మేషం
ఈ వారం ఈ రాశివారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు శుభసమయం అనే చెప్పాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. పఓ శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి..ఎవ్వరి వ్యవహారాల్లోనూ తలదూర్చవద్దు.



వృషభం
ఈ వారం వృషభరాశివారికి బాగానే ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభసమయం. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసొచ్చే సమయం. తగాదాలకు దూరంగా ఉండండి.



మిథునం
ఈ వారమంతా మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. అనవసర విషయాలతో టైమ్ వేస్ట్ చేయకండి. మృదువుగా మాట్లాడండి. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.



కర్కాటకం
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. ఇంటా-బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అష్టమ శని కారణంగా అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ పూర్తవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులుకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అనవసర ప్రసంగాలు చేయకండి, అప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది.



సింహం
ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఒత్తిడి పెుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.



కన్య
అనవసర విషయాలకు, ప్రసంగాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి వృద్ధి చేయాలనే మీ ప్రయత్నం విజయంవంతం అవుతుంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి.



తుల
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. పని మొదలెట్టడంపై ఉన్న శ్రద్ధ పూర్తిచేయడంపై ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆదాయం బావుంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉండరు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టిపెట్టాలి.



వృశ్చికం
ఈ వారం మీకు ప్రశాంతంగా గడిచిపోతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు వస్తాయి. ఓ శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి జాగ్రత్త. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.



ధనుస్సు
ఈ వారం చికాకులు, వివాదాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడులకు మంచి సమయం కాదు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారే ఇప్పుడు ముఖం చాటేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం అనుకూల సమయం ఇది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



మకరం
ఈ వారం ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త పడండి.



కుంభం
మీ బాధ్యతను మీరు శక్తివంచన లేకుండా కృషిచేస్తారు. మీకు దైవబలం ఉంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ట తగినంత శ్రద్ద అవసరం. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిపెరుగుతుంది. ప్రేమవ్యవహారాలు మీకు కలసిరావు. ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు మంచి టైమ్ ఇది.



మీనం
ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఈ వారం బాగానే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం, ఆదాయం రెండూ బావుంటాయి. నిన్నటి వరకూ వెంటాడీన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. వ్యసనాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఓర్పుగా వ్యవహరించాలి.